పంచె కట్టులో చేసిన నడకకు కారణాలు
- November 21, 2017
హీరో జగపతిబాబు పంచె కట్టులో చేసిన నడకకు కారణాలు ఏంటో చెప్పేశారు. వాక్ ఫర్ కాజ్ పేరుతో చిన్న సినిమాలను ఆదరించాలని, చిన్న సినిమాలకి థియేటర్స్ కేటాయించాలనే ముఖ్య ఉద్దేశ్యంతో తాను నడక చేపట్టానన్నారు. ఐమ్యాక్స్ వద్ద గల లేక్ వ్యూ పార్క్ లో రచయిత మూవీ పోస్టర్‌ను జగపతిబాబు ఆవిష్కరించారు.
చిన్న సినిమాలను ఆదరించాలని, ఆదరణ లేక మంచి సినిమాలు చచ్చిపోతున్నాయని జగపతిబాబు చెప్పారు. చిన్న సినిమాలను ప్రతి ఒక్కరూ ఆదరించాలనే కారణంతో తాను నడక కార్యక్రమం చేపట్టానని చెప్పారు. చిన్న సినిమాల్ని బతికిద్దామని, తాను చేస్తున్న నడకకు వైజాగ్, విజయవాడలో మంచి సపోర్ట్ వచ్చిందని చెప్పారు. కొత్త హీరో, కొత్త డైరెక్టర్లు, కొత్త వాళ్లు చేసిన సినిమా "రచయిత" అని జగపతిబాబు చెప్పారు.
రచయిత లాంటి సినిమాలను అందరూ ఆదరించాలని కోరుకుంటున్నానన్నారు జగపతిబాబు. రచయిత సినిమా కథ నచ్చి బ్రాండ్ అంబాసిడర్‌గా చేస్తున్నానని, రచయిత టీమ్‌కు సపోర్ట్ చేస్తున్నానని జగపతి చెప్పారు. డేట్స్ కుదరక తాను ఈ సినిమా మిస్ అయ్యానన్న జగపతి, ఈ సినిమా హిట్ అవ్వాలనుకుంటున్నాని చెప్పారు. కథ నచ్చి అంబాసిడర్‌గా ఒప్పుకున్నట్లు తెలిపారు.
అంతేకాక రాజకీయాలకు తనకు సంబంధం లేదని జగపతిబాబు స్పష్టం చేశారు. వారం తరువాత మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి రచయిత సినిమా గురించి మరిన్ని వివరాలు చెప్తానని జగపతి చెప్పారు. నంది అవార్డుల ఎంపికపై మాట్లాడేందుకు జగపతిబాబు నిరాకరించారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష