రస్ అల్ ఖైమాలో ఏషియన్ కార్మికుడి సజీవ సమాధి
- November 21, 2017
రస్ అల్ ఖైమా: 30 ఏళ్ళ కార్మికుడొకరు సజీవ సమాధి అయిన ఘటన రస్ అల్ ఖైమాలో చోటు చేసుకుంది. ఓ భవన నిర్మాణ పనులు జరుగుతుండగా, ల్యాండ్స్లైడ్ చోటు చేసుకుని, కార్మికుడు అందులో ఇరుక్కుపోయాడు. ఈ ఘటనలో బాధితుడ్ని రక్షించేందుకు చేసిన ప్రయత్నాలేవీ సఫలం కాలేదు. రస్ అల్ ఖైమా సివిల్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ బ్రిగేడియర్ మొహమ్మద్ అబ్దుల్లా అల్ జాబి మాట్లాడుతూ, ఓ వ్యక్తి మృతి చెందగా ఇద్దరిని తమ రెస్క్యూ టీమ్స్ రక్షించాయని చెప్పారు. ఉదయం 10.35 నిమిషాల సమయంలో ఈ దుర్ఘటనకు సంబంధించిన సమాచారం అందిందనీ, ఆ వెంటనే అంబులెన్స్, పారా మెడిక్స్, రెస్క్యూ టీమ్స్ని సంఘటనా స్థలానికి పంపించామని చెప్పారు మొహమ్మద్ అబ్దుల్లా. ఇద్దరు వ్యక్తుల్ని రెస్క్యూ టీమ్స్ రక్షించగలిగాయనీ, వారికి చిన్న గాయాలు మాత్రమే అయ్యాయనీ, ఓ వ్యక్తిని మాత్రం కాపాడలేకపోయామని చెప్పారు. చట్ట పరమైన చర్యల నిమిత్తం రస్ అల్ ఖైమా సివిల్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ సంబంధిత శాఖలకు ఈ కేసును రిఫర్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







