ట్రిపుల్ తలాక్ పై నిషేధం దిశగా కేంద్రం అడుగులు
- November 21, 2017
వివాదాస్పదమైన ట్రిపుల్ తలాక్‌ను దేశంలో పూర్తిగా నిషేధించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. వచ్చే శీతాకాల సమావేశాల్లో దీన్ని నిషేధించే బిల్లును ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే ఏర్పాటైన మంత్రుల కమిటీ ట్రిపుల్ తలాక్ నిషేధంపై బిల్లును తయారు చేస్తున్నట్లు సమాచారం. పార్లమెంట్ లోక్‌సభలో బీజేపీకి సంపూర్ణ మెజార్టీ ఉండగా, రాజ్యసభలోనూ మిత్రులను కలుపుకుంటే ఈ బిల్లు సులువుగానే చట్టరూపం దాల్చే అవకాశం కనిపిస్తోంది.
ట్రిపుల్ తలాక్‌పై ఆగస్టులో సంచలనాత్మక తీర్పు చెప్పింది సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం. ట్రిపుల్ తలాక్ రాజ్యావిరుద్ధమంటూ తీర్పు వెలువరించింది. ఇది ముస్లిం మహిళల ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తోందని అభిప్రాయపడింది. తలాక్ చెప్పే సంప్రదాయంపై ఆరు నెలల పాటు నిషేధం విధిస్తూ.. ఆ లోగా చట్టం చేయాలని కేంద్రానికి సూచించింది. సుప్రీం సూచనతో.. వెంటనే పని మొదలుపెట్టిన మోడీ సర్కార్.. బిల్లును సిద్ధం చేస్తోంది. శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టనుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







