అల్ ఖైదా టెర్రర్ గ్రూప్ అనుమానితుల అరెస్ట్
- November 21, 2017
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ముగ్గురు అనుమానిత అల్ ఖైదా తీవ్రవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం బెంగాల్‌కు చెందిన ఎస్టీఎఫ్ పోలీసులు వారిని కోల్‌కతా రైల్వే స్టేషన్లో అరెస్ట్ చేశారు.
వారి నుంచి పోలీసులు అల్ ఖైదాకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను శంషద్్ మియా అలియాస్ తన్వీర్ అలియాస్ సైఫుల్ అలియాస్ తుషార్ బిశ్వా (26)గా గుర్తించారు. ఇతను బంగ్లాదేశ్‌వాసి.
మరో ఇద్దరిలో బంగ్లాదేశ్‌కు చెందిన రిజౌల్ ఇస్లామ్ అలియాస్ రియాజ్ అలియాస్ సుమోన్ (25), బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాలోని ఖోలాపోటాకు చెందిన మోనోటోష్ డే అలియాస్ మోనా దా (46)గా గుర్తించారు.
ఈ మేరకు కోల్‌కతా ఎస్టీఎఫ్ పోలీసు అధికారి మురళీధర శర్మ మాట్లాడారు. ముగ్గురిని ఎస్టీఎఫ్ టీం అరెస్టు చేసినట్లు చెప్పారు. వారు ఏడాదన్నరగా భారత్‌లో అక్రమంగా నివసిస్తున్నట్లు తెలిపారు. సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి వచ్చిన సమాచారం మేరకు అరెస్టు చేసినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష