అధ్యక్షుడిగా కొనసాగేందుకు ముగాబే యత్నాలు!
- November 21, 2017
హరారే: జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే అధికార పార్టీ అల్టిమేటంను ధిక్కరించారు. అధ్యక్షుడిగా కొనసాగేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. సోమవారం మధ్యాహ్నానికల్లా అధ్యక్ష పదవి నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవాలని అధికార పార్టీ గడువు విధించింది. అయితే తాను తప్పుకునేది లేదని, అధ్యక్షుడిగా కొనసాగుతానని 93 ఏళ్ల ముగాబే తేల్చి చెప్పారు. గతవారం ముగాబేను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. సోమవారం మధ్యాహ్నానికల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని లేదంటే పార్లమెంట్ అభిశంసన ద్వారా తప్పిస్తామని అల్టిమేటం జారీ చేసింది.
అధ్యక్ష పదవి నుంచి త్వరగా తప్పుకోవడం ద్వారా గౌరవాన్ని కాపాడుకోవాలని వెటరన్స్ అసోసియేషన్ నేత క్రిస్ ముత్స్‌వాంగ్వా అధ్యక్షుడు ముగాబేకు సూచించారు. ప్రస్తుతం అతడు మిలటరీ నీడన గృహ నిర్బంధంలో ఉన్నప్పటికీ ఆయనే తమ కమాండర్ ఇన్ చీఫ్ అని, అతనికి భద్రత కల్పిస్తామని వివరించారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష