ఎక్లయిర్స్
- November 21, 2017పేస్ట్‌కి కావలసినవి: వెన్న 100గ్రా.,మైదా 100గ్రా., నీళ్లు పావులీటరు, పంచదార ఒక టేబుల్ స్పూన్, నాలుగు గుడ్లు.., బన్నుల్లో నింపడానికి, టాపింగ్‌కి..., 200గ్రా చాకొలెట్, 150 మి.లీ క్రీం.
తయారీ విధానం
నీళ్లల్లో వెన్న వేసి మరిగించి దించి దానిలో పంచదార, మైదా వేసి బాగా కలిసేలా గిలకొట్టండి. పిండి మృదువుగా మారిన తరువాత మళ్లీ పొయ్యి మీద పెట్టి పిండి పక్కల అంటుకోకుండా ఉన్నప్పుడు దించివేయండి. అందు లో గిలక్కొట్టిన గుడ్లు వేసి బాగా కలియతిప్పండి. దీనివలన పిండి చిక్కగా మెరుస్తూ స్పూన్ నుంచి జారిపోయేలా అవుతుంది. దీనిని (ఎక్లైర్స్) సన్నగా పొడవైన ఆకారంలో వచ్చేలా చేసుకుని బేకింగ్ గిన్నెలో వేసుకుని 25 నిమిషాల పాటు కుక్కర్లో కేక్‌ని బేక్ చేసినట్లుగా చేయండి.
ఫిల్లింగ్‌కి...
చాకొలెట్ని, క్రీంని కరిగించి రెండుభాగాలుగా విభజించండి. పదునైన చాకు ని తీసుకుని ఎక్లైర్స్కి రంధ్రం చేసి అందులో చాకొలెట్ మిశ్రమాన్ని నింపండి. పూర్తిగా నింపిన తరువాత ఎక్లైర్స్ అన్నింటినీ మిగిలిన చాకొలెట్ మిశ్రమం లో దొర్లిస్తే వాటి వెలుపల కూడా అంటుకొని చాకొలెట్ రుచి పిల్లలకి బాగా నచ్చుతుంది.
తాజా వార్తలు
- పాకిస్థాన్‌లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్‌కు గూగుల్ చెక్