బీజేపీకి.. టీడీపీకి మధ్య వంశీ చిచ్చు

- November 22, 2017 , by Maagulf
బీజేపీకి.. టీడీపీకి మధ్య వంశీ చిచ్చు

గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామాకు సిద్ధమయ్యారు. దీంతో బుధవారం ఏపీ అసెంబ్లీ లాబీల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. తన నియోజకవర్గ పరిధిలోనే డెల్టా షుగర్స్ మూసివేత విషయంలో ఆయన కొన్నాళ్లుగా ప్రభుత్వంపై సీరియస్‌గా వున్నారు. బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజుకి చెందిన డెల్టా షుగర్స్ నాలుగునెలల కిందట మూసివేశారు. దీన్ని మరో ప్రాంతానికి తరలించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నది వంశీ ఆరోపణ.

అదే జరిగితే తమ ప్రాంతంలోని చెరకు రైతులు నష్టపోతారని, ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కొన్నాళ్లుగా ఆయన చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ క్రమంలో అటో ఇటో తేల్చుకుందామని బుధవారం ఆయన సీఎం క్యాంప్ ఆఫీసుకు వచ్చారు. కానీ, సీఎంవో అధికారులు ఆయనతో అమర్యాదగా ప్రవర్తించినట్టు తెలుస్తోంది. దీంతో మనస్తాపానికి గురైన ఆయన.. రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. రిజైన్ లెటర్‌ని స్పీకర్‌కి ఇవ్వడానికి వెళ్తుండగా, అక్కడేవున్న మరో ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అడ్డుకుని ఆ లెటర్‌ని చించివేశారు. సమస్య జఠిలంకావడంతో మంత్రి లోకేష్, వంశీకి సర్దిచెప్పేందుకు కళావెంకట్రావును పురమాయించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com