డిసెంబర్ కొన్ని క్రేజీ సినిమాలు విడుదల

- November 22, 2017 , by Maagulf
డిసెంబర్ కొన్ని క్రేజీ సినిమాలు విడుదల

డిసెంబర్ కొన్ని క్రేజీ  సినిమాలు పోటీ పడుతున్నాయి.  నాని నటించిన ఎమ్.సి.ఎ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు చిత్ర యూనిట్ . కానీ పోస్ట్ ప్రొడక్షన్ లేట్ అవ్వడం వల్ల 21కి ఈ చిత్రం వాయిదా పడేలా ఉంది. నానికి జోడీగా సాయిపల్లవి నటించిన ఈ మూవీకి నిర్మాత దిల్ రాజు. ఈ మూవీపై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.

ఇక డిసెంబర్ 22న అక్కినేని అఖిల్ తన రెండో సినిమా హలోతో రాబోతున్నాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి నాగార్జున నిర్మాత. ఫస్ట్ లుక్ టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంతో హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు అఖిల్.

వీటిలో పాటు డిసెంబర్ లో అల్లు శిరీష్ హీరోగా విఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఒక్క క్షణం మూవీ కూడా రాబోతుంది. ఈ మూవీ డిసెంబర్ సెకండ్ హాఫ్ లోనే వచ్చే అవకాశం ఉంది. అలాగే సునీల్ నటించిన టూ కంట్రీస్ కూడా డిసెంబర్ లోనే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 

సాయిధరమ్ తేజ్ జవానా, నాని మిడిల్ క్లాస్ అబ్బాయ్, అఖిల్ హలో, సునీల్ టూ కంట్రీస్, అల్లు శిరీష్ ఒక్క క్షణంతో పాటు యంగ్ హీరో నాగశౌర్య నటించిన చలో కూడా ఈ నెలలోనే వస్తోంది. డిసెంబర్ 29న ఈ సినిమా విడుదల చేసేందుకు డేట్ లాక్ చేశారు. అయితే ఒకటి రెండు సినిమాలు తప్ప మిగతావి డేట్ చేంజ్ చేసుకునే అవకాశం కనిపిస్తోంది. మరి డిసెంబర్ లో రాబోతున్న ఈ సినిమాలు, ప్రేక్షకులను ఎలా మెప్పిస్తాయో చూడాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com