యూఏఈ నేషనల్‌ డే: ప్రైవేట్‌ సెక్టార్‌కి హాలీడే ప్రకటన

- November 22, 2017 , by Maagulf
యూఏఈ నేషనల్‌ డే: ప్రైవేట్‌ సెక్టార్‌కి హాలీడే ప్రకటన

యూఏఈ, ప్రైవేట్‌ సెక్టార్‌కి సంబంధించి 46వ నేషనల్‌ డే అలాగే మార్టీర్స్‌ డే సందర్భంగా సెలవుల్ని ప్రకటించింది. మినిస్ట్రీ ఆఫ్‌ హ్యూమన్‌ రిసోర్సెస్‌ అండ్‌ ఎమిరటైజేషన్‌ వెల్లడించిన వివరాల ప్రకారం, నవంబర్‌ 30 నుంచి డిసెంబర్‌ 2 వరకు సెలవులు ఉంటాయి. డిసెంబర్‌ 3 నుంచి యధాతథంగా తిరిగి విధులు కొనసాగుతాయి. గత వారం నేషనల్‌ డే సెలవుల్ని పబ్లిక్‌ సెక్టార్‌ కోసం యూఏఈ ప్రభుత్వం ప్రకటించింది. వరుస సెలవుల కారణంగా లాంగ్‌ వీకెండ్‌ని ఎంజాయ్‌ చేసే అవకాశం యూఏఈ వాసులకు కలిగింది. 2017లో ఇదే చివరి లాంగ్‌ హాలీడే. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com