సౌదీ నగరం జెడ్డాలో వరదలు: ముగ్గురి మృతి
- November 22, 2017
సౌదీ అరేబియాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా వరదలు పోటెత్తుతున్నాయి. ప్రముఖ నగరం జెడ్డాలో వరదల కారణంగా ఇప్పటిదాకా ముగ్గురు మృతి చెందారు. వరదల నేపథ్యంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో స్కూళ్ళకు, కాలేజీలకు, ఇతర విద్యా సంస్థలకు సెలవుల్ని ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. జెడ్డాలో ఒకరు మృతి చెందారనీ, మక్కా రీజియన్‌లో మరో ముగ్గురు మృతి చెందారని అధికారులు వెల్లడించారు. జెడ్డా హెల్త్ ఎఫైర్స్‌కి మొత్తం 29 ఎమర్జన్సీ రిపోర్ట్స్ అందాయి. సివిల్ డిఫెన్స్ 250 రిపోర్ట్స్ అందుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. మక్కా ప్రావిన్స్‌లో షార్ట్ సర్క్యూట్స్‌కి సంబంధించి ఈ ఫిర్యాదుల్ని సివిల్ డిఫెన్స్ అందుకుంది. భారీ వర్షాల వల్ల వచ్చిన ఆకస్మిక వరదల్లో కూరుకుపోయిన వాహనాల నుంచి చాలామందిని సివిల్ డిఫెన్స్ రక్షించింది. మదీనా, సెంట్రల్ ఏరియా ప్రాంతాల్లోనూ వర్షాల కారణంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఎక్కడికక్కడ సహాయక కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. జెడ్డా, మక్కా, తైఫ్‌లలో రానున్న రోజుల్లో మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు జనరల్ అథారిటీ ఆఫ్ మిటియరాలజీ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ పేర్కొంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







