మహిళల ముందు అర్ధనగ్న ప్రదర్శన: వ్యక్తికి జైలు
- November 22, 2017
వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మహిళల ముందు ఓ వ్యక్తి అర్ధనగ్నంగా వెకిలి చేష్టలు చేయడం, వారిని అవమానించేలా తన శరీరమ్మీదే అసభ్యకరంగా తాకడం వంటి పనులు చేసినందుకుగాను 35 ఏళ్ళ పాకిస్తానీ వ్యక్తికి జైలు శిక్ష విధించింది. సెప్టెంబర్ 20న ఓ ఘటన చోటు చేసుకుంది. జర్మన్ మహిళ జాగింగ్ చేస్తూ, ఆ వ్యక్తిని డైరెక్షన్స్ అడగ్గా ఆమెతో ఆ వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమె ఏడుస్తూ, పోలీసులను ఆశ్రయించగా అప్పటికే ఆ వ్యక్తి అక్కడి నుంచి కారులో పారిపోయాడు. అదే ప్రాంతంలో రెండ్రోజులతర్వాత నిందితుడు మరో మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈసారి బాధితురాలు భారతీయ మహిళ అయ్యింది. బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో నిందితుడ్ని పోలీసులు పట్టుకున్నారు. బాధితులు ఇద్దరూ నిందితుడ్ని గుర్తించారు. అయితే తొలుత నిందితుడు మాత్రం తనపై వచ్చిన ఆరోపణల్ని ఖండించాడు. అయితే విచారణలో నిందితుడు నేరం అంగీకరించడమే కాకుండా, పలువురితో ఇలాగే ప్రవర్తించినట్లు ఒప్పుకున్నాడు. దాంతో అతనికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







