ట్రాఫిక్ జరీమానాలపై డిస్కౌంట్: షేక్ మొహమ్మద్ ఆదేశం
- November 22, 2017
ఇయర్ ఆఫ్ గివింగ్లో భాగంగా ట్రాఫిక్ జరీమానాల్ని 50 శాతం తగ్గించాల్సిందిగా సంబంధిత శాఖలకు యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ఆదేశించారు. షేక్ మొహమ్మద్ జారీ చేసిన రిజల్యూషన్ ప్రకారం, 2016 జులై 1 నుంచి 2016 డిసెంబర్ 31 మధ్య జరీమానాలకు ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. ఈ ఏడాది అంటే 2017 నుంచి జారీ అయిన జరీమానాలకు మాత్రం ఈ డిస్కౌంట్ వర్తించదు. ఇన్స్టాగ్రామ్లో దీనికి సంబంధించిన వివరాల్ని దుబాయ్ పోలీసులు పోస్ట్ చేశారు. 2017లో జరీమానాలకు ఈ డిస్కౌంట్ ఎట్టి పరిస్థితుల్లోనూ వర్తించదని దుబాయ్ పోలీస్ కమాండర్ మేజర్ జనరల్ అబ్దుల్లా ఖలీఫా అల్ మర్రి చెప్పారు. మోటరిస్టులు తమ జరీమానాల్ని ట్రాఫిక్ డిపార్ట్మెంట్, పోలీస్ స్టేషన్స్, వెహికిల్ రిజిస్ట్రేషన్ సెంటర్స్, ఫైన్ పేమెంట్ మెషీన్స్ వంటి వాటి ద్వారా చెల్లించవచ్చు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







