విజయవంతంగా బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగం
- November 22, 2017
న్యూదిల్లీ: ప్రపంచ అత్యంత వేగవంతమైన సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్ పరీక్ష విజయవంతమైంది. భారత వాయుసేన(ఐఏఎఫ్)కు చెందిన సుఖోయ్-30ఎంకేఐ విమానం నుంచి తొలిసారిగా దీన్ని ప్రయోగించినట్లు రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. రెండు దశల్లో చేపట్టిన ఈ ప్రయోగంలో బంగాళాఖాతంలోని లక్ష్యాన్ని క్షిపణి విజయవంతంగా ఛేదించిందని పేర్కొంది.
ఈ ప్రయోగంతో 2.5 టన్నుల బరువున్న ఈ క్షిపణిని భూమి, ఆకాశం, సముద్రం నుంచి ప్రయోగించవచ్చని నిరూపితమైందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. 3,200 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఇది చేరుకోగలదని పేర్కొంది. దీని వల్ల వాయుసేన సామర్థ్యం మరింత పెరుగుతుందని అధికార వర్గాలు తెలిపాయి. క్షిపణి ప్రయోగం విజయంతం పట్ల రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ హర్షం వ్యక్తంచేశారు. డీఆర్‌డీవో శాస్త్రవేత్తలను అభినందించారు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







