గల్లంతయిన యువకుడి మృతదేహం ఒమన్‌లో లభ్యం
- November 22, 2017
భారీ వర్షాల వల్ల తలెత్తిన ఆకస్మిక వరదల్లో కొట్టుకుపోయిన యువకుడి మృతదేహం ఎట్టకేలకు ఒమన్‌లో కనుగొన్నారు. నవంబర్ 16న 18 ఏళ్ళ ఆల్బర్ట్ జాయ్, తన ఐదుగురు స్నేహితులతో కలిసి వాహనంలో షికారుకి వెళ్ళగా, ఆకస్మిక వరదల్లో ఆ కారు చిక్కుకపోయింది. ఎమిరేటీ వ్యక్తి ఒకరు అత్యంత సాహసోపేతంగా ఆ కారులోంచి ఐదుగుర్ని కాపాడాడు. అయితే, దురదృష్టవశాత్తూ ఆల్బర్ట్ జాయ్ మాత్రం కారుతో సహా కొట్టుకుపోయాడు. అతన్ని రక్షించేందుకు అధికారులు ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది.రస్ అల్ ఖైమాలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో ఆల్బర్ట్ విద్యనభ్యసిస్తున్నాడు. దుబాయ్‌లోని ఇండియన్ కాన్సుల్ జనరల్ విపుల్, బాధిత కుటుంబాన్ని నవంబర్ 21న పరామర్శించారు. షార్జా, అలాగే దుబాయ్ పోలీసులు, రెస్క్యూ టీమ్స్, అబుదాబీ పోలీస్ ఎయిర్ వింగ్ సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టాయి. కానీ ఈ ఘటన విషాదాంతమయ్యింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







