గర్భిణీ స్త్రీ వేషధారణపై బాలివుడ్ నటుడి కామెంట్లు

- November 23, 2017 , by Maagulf
గర్భిణీ స్త్రీ వేషధారణపై బాలివుడ్ నటుడి కామెంట్లు

కొందరికి వయసు పెరిగినా ఆలోచనలు మారవు. ఎదుటి వారిపై కామెంట్స్ చేస్తూ సరదాగా కామెడీ చేస్తున్నామనుకుంటారు. పెద్దరికాన్ని ప్రదర్శించరు. ఇప్పుడు ఇదే కోవలోకి వచ్చి చేరాడు ఒకప్పటి బాలీవుడ్ హీరో రిషి కపూర్ కూడా. ఇలాంటి కామెంట్సే చేసి నెటిజన్స్ చేత చీవాట్లు తింటున్నారు. ప్రముఖ అమెరికన్ పాప్ స్టార్ బియాన్సే వేసుకున్న దుస్తులపై కామెంట్స్ చేశారు. ఆమె ఎరుపు రంగు గౌను వేసుకుని తలపై పూలు పెట్టుకుని దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ ఫొటోను రిషి కపూర్ పూల కుండీతో పోలుస్తూ 'పూల్ ఖిలే హై గుల్షన్ గుల్షన్' అంటూ తన సినిమా టైటిట్ పేరిట బియాన్సేని ఉద్దేశించి కామెంట్ పెట్టారు. ఇంతకు ముందు కూడా నటి కిమ్ కర్దాషియాన్‌ని కూడా ఇదే తరహాలో కామెంట్స్ చేసి విమర్శల పాలయ్యారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com