నా పర్సనల్ విషయాలు మీకెందుకు అంటూ బీజేపీపై విరుచుకుపడ్డ ప్రకాష్

- November 23, 2017 , by Maagulf
నా పర్సనల్ విషయాలు మీకెందుకు అంటూ బీజేపీపై విరుచుకుపడ్డ ప్రకాష్

నటుడు ప్రకాష్ రాజ్.. బీజేపీ మీద ప్రత్యక్ష యుద్ధానికి దిగేశారు. 'జస్ట్ ఆస్కింగ్' అంటూ ఇన్నాళ్లూ సోషల్ మీడియా ద్వారా మాత్రమే మోడీ సర్కారుపై దాడి చేస్తూ వచ్చిన ప్రకాష్ రాజ్.. ఇక ఫిజికల్ స్ట్రెంత్ చూపించడానికి 'గెట్ రెడీ' చెప్పేశారు. తన మీద వ్యక్తిగత వ్యాఖ్యలు చేసిన మైసూర్ బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహకు తన లాయర్ ద్వారా లీగల్ నోటీసులు పంపారు ప్రకాష్ రాజ్. 'కొడుకు చనిపోయిన బాధలో వున్న భార్యను వదిలిపెట్టి ఒక డ్యాన్సర్ తో వెళ్ళిపోయిన మిస్టర్ ప్రకాష్ రాజ్.. మోదీ మీద, యోగీ మీద కామెంట్ చేసే నైతిక హక్కు నీకుందా?'' అంటూ అక్టోబర్ 2న బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
మహిళా జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్య విషయంలో ప్రధాని మోడీ నిశ్శబ్దంగా ఎందుకున్నారన్న ప్రకాష్ రాజ్ ప్రశ్నకు బదులుగా ఈ రియాక్షన్ వచ్చింది. ''ఇటువంటి పర్సనల్ అట్టాక్ ద్వారా.. తనను వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టినందుకు నీ మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదు.. నాకు సంజాయిషీ కావాలి.'' అన్నది ప్రకాష్ రాజ్ పంపిన లీగల్ నోటీసుల సారాంశం దీంతో.. ప్రకాష్ రాజ్.. డైరెక్ట్ గా బీజేపీతోనే పెట్టుకున్నట్లయింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com