ట్రాఫిక్ ఉల్లంఘనలను ప్రవాసీయులు పదే పదే పునరావృతం చేస్తే ...దేశబహిష్కరణ

- November 23, 2017 , by Maagulf
ట్రాఫిక్ ఉల్లంఘనలను ప్రవాసీయులు పదే పదే  పునరావృతం చేస్తే ...దేశబహిష్కరణ

కువైట్:  సీటు బెల్ట్ లేకుండా డ్రైవింగ్ చేయడం..అలాగే  డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చేతితో మొబైల్ ఫోన్ లో మాట్లాడుతున్న తదితర ఉల్లంఘనలను పునరావృతం చేస్తూ ఏ ప్రవాసీయుడైన వ్యవహరిస్తుంటే అటువంటివారిని దేశం నుండి బహిష్కరించాలని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. జనరల్ పబ్లిక్ రిలేషన్స్ అండ్ సెక్యూరిటీ మీడియా డిపార్ట్మెంట్ డైరెక్టర్ బ్రిగేడియర్ ఆడెల్ అల్-హషాష్ పైన పేర్కొన్న తీరులో ఇటీవల, అధికారులు పలు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఆయా వాహనదారులు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సీట్ బెల్ట్లను ధరించకపోవడం లేదా మొబైల్ ఫోన్ లో మాట్లాడుతూ వాహనాలను నడపడం తదితర ట్రాఫిక్  ఉల్లంఘనలకు పాల్పడినట్లు తెలిపారు. ఆయా అతిక్రమణలు పాల్పడినవారు వాహనాలను రెండు నెలల పాటు స్వాధీనం చేసుకొనే వీలు ట్రాఫిక్ చట్టం  కల్పిస్తుంది, అయితే ట్రాఫిక్ ఉల్లంఘనలను ప్రవాసీయులు పదే పదే  పునరావృతం చేస్తే ...వారిని దేశబహిష్కరణ చేయడానికి సైతం వెనుకాడబోమని ఆంతరంగిక మంత్రిత్వశాఖ పేర్కొంది.  వాహనదారులు ట్రాఫిక్ నియమాలకు కట్టుబడి ఉండాలని  వాహనదారులు మరియు ఇతర రహదారి వినియోగదారుల భద్రత కోసం ట్రాఫిక్ అధికారులతో సహకరించడానికి ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com