జెట్ ఎయిర్వేస్ విమానాల్లో ఇక ఫస్ట్‌క్లాస్ సీట్లుండవ్!
- November 23, 2017
ప్రముఖ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ ఖర్చులు తగ్గించి ఆదాయాన్ని పెంచుకునేందుకు కొత్త మార్గాలు అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా సూదూర ప్రాంతాలకు వెళ్లే తమ బోయింగ్ 777 విమానాల్లో ఫస్ట్‌క్లాస్ సీట్లను తొలగించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇటీవల ఇన్వెస్టర్ల సమావేశంలో దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించింది.ప్రస్తుతం జెట్ఎయిర్వేస్కు 10 బోయింగ్ 777 విమానాలు ఉన్నాయి. వీటిలో ఉన్న ఫస్ట్‌క్లాస్ సీట్లను తొలగించి మొత్తం సీట్లను పెంచాలని యోచిస్తోంది. ప్రస్తుతం ఈ తరహా విమానాల్లో 8 ఫస్ట్‌క్లాస్ సీట్లు, 30 బిజినెస్ క్లాస్, 308 ఎకానమీ క్లాస్ సీట్లు ఉంటాయి. మొత్తంగా 346 సీట్లుండే ఈ విమానంలో మొత్తం సీట్లను 400 వరకు పెంచనున్నట్లు ఇన్వెస్టర్లకు ఇచ్చిన ప్రజంటేషన్లో తెలిపింది. 2019 నుంచి ఇది అమల్లోకి తీసుకురానుంది. ఖర్చులు తగ్గించుకుని భవిష్యత్‌లో ఆదాయాన్ని పెంచుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు జెట్ఎయిర్వేస్కు చెందిన ప్రతినిధి ఒకరు తెలిపారు.అయితే, దీనికి సంబంధించి పూర్తి వివరాలను కంపెనీ వెల్లడించలేదు. సీట్ల పునరుద్ధరణకు సంబంధించి ఎంతమేర ఖర్చు చేయనున్నారు వంటి తదితర వివరాలను సరైన సమయంలో వెల్లడిస్తామని సదరు ప్రతినిధి తెలిపారు. జెట్ ఎయిర్వేస్కు మొత్తం 110 విమానాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







