1 మిలియన్ పౌండ్లకు నిధులను ఐ ఎస్ వ్యతిరేక ఆపరేషన్ కొరకు ఎమిరి ఎయిర్ ఫోర్స్ కు బదిలీ
- November 24, 2017
కతర్: ఇరాక్ మరియు సిరియాలో స్వాభావిక పరిష్కారం కోసం ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో అంతర్జాతీయ సంకీర్ణ సైన్యం ద్వారా నిర్వహించబడుతున్న వివిధ కార్యకలాపాలలో ఎమిరి ఎయిర్ ఫోర్స్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇటీవల నవంబర్ 7 వ తారీఖున కతరి ఎమిరి ఎయిర్ ఫోర్స్ శాఖకు ఒక మిలియన్ పౌండ్లకు పైగా నిధులు ఐ ఎస్ వ్యతిరేక ఆపరేషన్ కొరకు మంజూరు చేయబడింది. ఎమిరి ఎయిర్ ఫోర్స్ ఈ సంవత్సరం ఒక ప్రధాన సాఫల్యం సాధించింది. కతర్ ఎమిరి ఎయిర్ ఫోర్స్ సమూహం సి -17 మరియు సి -130 జే ఎయిర్ ట్రాన్స్పోర్ట్ విమానం భారీగా ముఖ్యమైన పదార్థాల సరుకులను రవాణా చేయటం ద్వారా మరియు జూన్ వరకు అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాల కార్యకలాపాలలో పాలుపంచుకున్నాయి. కతర్ ఎమిరి ఎయిర్ ఫోర్స్ రవాణా విమానం సామర్ధ్యం వేగవంతమైన విన్యాసాలతో ఐస్ ఐస్ పై దాడులు జరిపి ఆయా తీవ్రవాదులను నేలకూల్చడంలో సాహసోపేత కార్యకలాపాలను నిర్వహించడంలో ఐక్యరాజ్యసమితి ద్వారా ప్రశంసలు పొందింది. ఆకాశంలో నిర్వహించిన కార్యకలాపాల వలన ఎన్నో విజయాలకు దోహదం చేసినట్లు గుర్తించబడింది. ఈ ప్రాంతం నుంచి సంకీర్ణ దళాలకు అవసరమైన మద్దతును అందించడంలో ఎంతో ముఖ్య భూమిక పోషించింది.
తాజా వార్తలు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..







