సింపుల్ గా తేల్చేసిన సునీత

- November 24, 2017 , by Maagulf
సింపుల్ గా తేల్చేసిన సునీత

ఎప్పుడు సైలెంట్ గా ఉంటూ తన పాటలేంటో..తానేంటో తప్ప బయట విషయాలు పెద్దగా పట్టించుకోని సింగర్ సునీత.ఒక్క కామెంట్ తో ఇప్పుడు వార్తల్లో హాట్ టాపిక్ అయ్యింది. తాజాగా ట్రంప్ కూతురు ఇవాంక హైదరాబాద్ కు వచ్చిన సంగతి తెల్సిందే. ఈ సందర్బంగా ఇవాంక ప్రయాణించే రోడ్ల కోసం దాదాపు రూ60 కోట్లను ఖర్చు చేసి రోడ్లన్నీ బాగుచేయించారు.

అయితే ట్రంప్ కూతురు ఇవాంక రాయదుర్గం - ఖాజా గూడ రోడ్డు గుండా రావటం లేదేమో? వస్తే బావుండు అంటూ సింఫుల్ గా చెప్పేసి తెలంగాణ సర్కార్ ఫై విరుచుకుపడింది. ఈ కామెంట్ తో ఒక్కసారిగా సోషల్ మీడియా హాట్ టాపిక్ అయ్యింది. సింగర్ సునీత ఇంత మాట అనేసింది అని అంత షాక్ అవుతున్నారు.
ఫేస్ బుక్ లో ఆమె పెట్టిన పోస్ట్ పై పలువురు స్పందిస్తున్నారు. తెలంగాన రాష్ట్ర ప్రభుత్వంపై చురకలు వేస్తున్నారు. ఎప్పుడూ తన దారిన తాను అన్నట్లుగా ఉండే సింగర్ సునీతేనా.. ఇలా పోస్ట్ చేసిందనిపించేలా ఆమె పోస్ట్ ఉందంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com