రాజశేఖర్ కూతురు డాక్టర్ సీట్ కోసం సాయం అందించిన మెగాస్టార్
- November 24, 2017
టాలీవుడ్ లో చిరంజీవి, రాజశేఖర్ ల మధ్య అభిప్రాయబేధాలు ఏర్పడి... కొన్నేళ్ళ పాటు అలా కొనసాగిన మాట వాస్తవం. కాగా ఇటీవల రాజశేఖర్ రగుడవేగ సినిమా రిలేజ్ సందర్భంగా చిరంజీవిని రాజశేఖర్ దంపతులు కలుసుకొని సినిమా చూడడానికి ఆహ్వానించడంతో వీరిద్దరి మధ్య ఉన్న అభిప్రాయబేధాలు తొలగిపోయాయి అని అందరూ భావిస్తున్నారు. ఇదే విషయం పై రాజశేఖర్ స్పందిస్తూ... తామిద్దరం కొత్తగా కలుసుకొన్నది ఏమీ లేదని.. తమ మధ్య ఎప్పుడో అభిప్రాయబేధాలు తొలగిపోయి.. స్నేహసంబంధాలు నెలకొన్నాయని రాజశేఖర్ తెలిపాడు. ఇటీవల రాజశేఖర్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... గతంలో తన కూతురు మెడికల్ సీటు కోసం తాను చిరంజీవి ఇంటికి వెళ్ళినట్లు తెలిపాడు. చిరంజీవి గారితో విబేధాలు వచ్చాక కొంత కాలం దూరంగా ఉన్నాము.. కానీ అప్పుడప్పుడు పబ్లిక్ ఫంక్షన్లో కలుస్తూనే ఉన్నాము. మేము సైతం వంటి ఫంక్షంలో కలిశాం... మా అమ్మాయి శివానికి మెడికల్ సీటు కోసం అపోలో మెడికల్ కాలేజీ లో ధరఖాస్తు చేశాం. ఈ విషయంపై జీవిత చిరంజీవి గారి ఇంటికి వెళ్లింది. జీవిత వెళ్ళగానే చిరంజీవి గారు నా గురించి అడిగారాట.. వెంటనే జీవిత నాకు ఫోన్ చేసి రమ్మనమని చెప్పింది. కానీ అప్పటికి నేను రెడీగా లేను.. దీంతో జీవిత వెనక్కి వచ్చి.. నన్ను చిరంజీవి గారి ఇంటికి తీసుకొని వెళ్లింది. చిరంజీవి గారు చాలా బాగా మాట్లాడారు.. శివాని సీటుకు అవసరమైన సాయం కూడా చేశారు. అప్పటి నుంచి మా మధ్య ఉన్న అభిప్రాయ బేధాలు తొలగి.. మరింత దగ్గర అయ్యాం.. అంతేకాదు.. గరుడ వేగ సినిమా సమయంలో కూడా చాలా సాయం అందించారు చిరంజీవి అని రాజశేకఃర్ తెలిపాడు. కాగా ఇప్పటికే రాజశేఖర్ తాను విలన్ పాత్రలకు అయినా ఒకే.. అని.. చిరంజీవి సినిమాలో విలన్ గా నటిస్తా అని ప్రకటించిన నేపద్యంలో త్వరలో మళ్ళీ రాజశేఖర్ వెండి తెరపై బిజీ అవుతాడేమో చూడాలి మరి.!!
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







