రెజీనా టాపిక్...తల కొట్టుకున్న తేజు
- November 26, 2017
క్రేజీ హీరోయిన్ రెజీనాకి మెగామేనల్లుడు సాయిధరమ్ తేజ్ కి మధ్యఉన్న సాన్నిహిత్యం పై గతంలో ఎన్నో రకాలవార్తలు వచ్చాయి. ఆతరువాత వీరిద్దరూ కలిసి నటించడం కూడ బాగా తగ్గించి వేసారు. అయినా ఏదో ఒకసందర్భంలో సాయిధరమ్ తేజ్ రెజీనా ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఏదో ఒకసమాధానం ఇవ్వవలసిన పరిస్థుతులు ఏర్పడుతున్నాయి. ఇప్పడు మళ్ళీ అటువంటి సందర్భమే తేజుకి ఎదురైంది.
డిసెంబర్ 1న విడుదకాబోతున్న తన 'జవాన్' సినిమాను ప్రమోట్ చేస్తూ ఒకమీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తేజుకి మళ్ళీ రెజీనా సమస్యఎదురైంది. ఈఇంటర్వ్యూలో భాగంగా ర్యాపిడ్ ఫైర్ ప్రశ్నల సందర్భంగా కొందరు అమ్మాయిలతో మాట్లాడిన తేజు తన పక్కన ఏహీరోయిన్ నప్పుతుంది అనే ప్రశ్నవేసాడు. ఈప్రశ్నకు ఆకార్యక్రమానికి వచ్చిన అమ్మాయులు అంతా రెజీనా అని సమాధానం చెప్పడంతో సాయిధరమ్ తేజ్ తలకొట్టుకొన్నాడు.
ఇదే సందర్భంలో తేజు మాట్లాడుతూ 'శతమానం భవతి' కథ తన దగ్గరికి వచ్చిన విషయం నిజమే అంటూ కేవలం డేట్స్ సమస్య కారణంగానే తాను ఆసినిమా చేయలేకపోయాను అన్న విషయాన్ని బయటపెట్టాడు. ఇదే ఇంటర్వ్యూలో మరోట్విస్ట్ ఇస్తూ సినిమా పరిశ్రమలో రాణించాలంటే బ్యాక్ గ్రౌండ్ అనేది ప్రధానంకాదు. టాలెంట్ ఆధారంగానే ఛాన్సులు వస్తాయి అంటూ కామెంట్స్ చేసాడు. తాను హీరోగా ప్రయత్నించే సమయంలో తనకు చాలా కష్టాలు ఎదురయ్యాయి అని అంటూ తాను ఆడిషన్స్‌కు వెళ్ళిన సందర్భాన్ని తెలియచేసాడు. మెగాస్టార్ చిరంజీవిలో హార్డ్ వర్క్ తనకు స్ఫూర్తి అంటూ సినీ పరిశ్రమలో చిరు స్థాపించిన సామ్రాజ్యంలోనే తామంతా బతుకుతున్నాం అంటూ తన మామయ్య పై తన భక్తిని చాటుకున్నాడు. పవన్ కల్యాణ్‌లో కమిట్‌మెంట్ నిజాయితీ తనకు చాలాఇష్టం అని అంటూ అల్లుఅర్జున్ హార్డ్ వర్క్ తనకు ఆదర్శం అని అంటున్నాడు.
చరణ్ రాయల్ ప్రిన్స్ లాంటివాడు అని అంటూ వరుణ్ తేజ్ చాలా విభిన్నమైన వ్యక్తి అంటూ కామెంట్స్ చేసాడు. ఇదే సందర్భంలో మరోట్విస్ట్ ఇస్తూ హీరోయిన్ మెహ్రీన్ గోల్డెన్ లెగ్ అంటే తాను ఒప్పుకోను అని అంటూ ఒకఅమ్మాయి లెగ్ పెడితే సినిమా హిట్ అవుతుందా? అంటూ జోక్ చేస్తున్నాడు తేజు. జీవితంలో తనకు డబ్బు కంటే ప్రేమ చాల ముఖ్యమైంది అంటూ కుటుంబ బంధాలపై కామెంట్స్ చేసాడు. ఏమైనా ఎటువంటి మొహమాటం లేకుండా ఈ మెగా యంగ్ హీరో చేసిన కామెంట్స్ ప్రస్తుతం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మరాయి..
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష