పార్కులో పాకిస్తాన్ పనివాడు బాలిక పట్ల అసభ్య ప్రవర్తన
- November 26, 2017
దుబాయ్ : కామంతో కళ్ళు మూసుకుపోయిన పాకిస్తాన్ కు చెందిన ఒక కామాంధుడు తన వికృత చేష్టలతో సభ్య సమాజం సిగ్గుతో తలా దించుకొనే నీచమైన దుర్మార్గానికి పాల్పడ్డాడు. ఓ పార్క్లో పని చేస్తున్న 34 ఏళ్ల ఆ వ్యక్తి ఒంటిరిగా ఆడుకుంటున్న 10 ఏళ్ల బాలికను లైంగికంగా వేధించాడు. బాలిక వెనుక నుంచి వెళ్లి కౌగిలించుకున్నాడు. నడుముపై రెండుసార్లు ముద్దు పెట్టుకున్నాడు. ఈ విషయాన్ని అక్కడే ఉన్న మరో మహిళ గమనించింది. నిందితుడిని తిట్టి ఆ బాలికను తనతోపాటు ఇంటికి తీసుకెళ్లింది. బాలిక తల్లికి ఫోన్ చేసి విషయాన్ని వివరించింది. వారు నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదవడంతో కోర్టులో విచారణ జరిగింది. నిందితుడికి మూడు నెలల జైలుశిక్ష విధించిన న్యాయస్థానం శిక్ష పూర్తవ్వగానే నిందితుడిని దేశం నుంచి బహిస్కరించాలని ఆదేశించింది. ఈ ఘటన యూఏఈలోని దుబాయ్ నగరంలో జరిగింది. బాధిత బాలిక ఓ అరబ్ వ్యక్తి కుమార్తె అని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







