నిర్మాత పుణ్యమా అని భర్తే విలన్!

- November 26, 2017 , by Maagulf
నిర్మాత పుణ్యమా అని భర్తే విలన్!

జేఎస్‌ అపూర్వ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై మహిళా నిర్మాత జయచంద్ర శరవణ కుమార్‌ నిర్మిస్తున్న చిత్రం 'తొడ్రా'. సీని యర్‌ దర్శ కుడు, నటుడు కె.భాగ్యరాజా దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన మధురాజ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన ఇంత కు ముందు 'చెన్నై ఉంగళై అన్బుడన్‌ అళైక్కిరదు', 'చాకోబార్‌' వంటి చిత్రాలను పంపిణీ చేశారు. దర్శకుడు కావాలన్న ఆశ తో మెగా ఫోన్‌ పట్టి 'తొడ్రా' చిత్రాన్ని తెర కెక్కిస్తున్నారు. హాస్యనటుడు పాండ్యరాజన్‌ తనయుడు పృథ్విరాజన్‌ హీరోగా నటిస్తుండ గా, వీణ అనే కొత్తమ్మాయి హీరోయిన్‌ గా పరిచయమవుతోంది. కథలో అత్యంత కీలకమైన చిన్నారి పాత్రలో అపూర్వ సహానా అనే బాలనటిని పరిచయం చేస్తున్నా రు. ఇంకా నిర్మాత శరవణకుమార్‌ విలన్‌గా నటిస్తున్నారు.
ఈ సినిమాలో విశేషాలు ఏమిటంటే... తన భర్త కోసం ఈ సినిమాను నిర్మిస్తున్నారు జయచంద్ర. పెళ్లయిన నాటి నుండే సినిమాల్లో నటించాలన్న భర్త కోరికను ఆమె 'తొడ్రా' చిత్రంతో నెరవేరుస్తున్నారు. అయితే ఇందులో శరవణకుమార్‌ హీరోగా నటించకుండా, విలన్‌ పాత్రలో నటించడం ఆశ్చర్యం కలిగించే అంశం. కాగా, నేటి తరం యువతకు ఎదురవుతున్న సమస్యల్లో ఒకటైన లవ్‌ బిజినెస్‌ను నేపథ్యంగా తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు దర్శకుడు మధురాజ్‌ చెప్పారు. పొల్లాచ్చి, కృష్ణగిరి, పళని, కరూర్‌ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుతున్నారు. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో 'తోడ్రా' ప్రేక్షకుల ముందుకు రానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com