ఆపదలో ఆదుకున్న 'మనం సైతం'

- November 26, 2017 , by Maagulf
ఆపదలో ఆదుకున్న 'మనం సైతం'

కాదంబరి కిరణ్ గారు మనం సైతం కాదంబరి గ్రూప్ ద్వారా ఎంతో మంది పేదలకి సహాయం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న సంగతి తెలిసిందే. మనం బతకడమే కాదు.. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలనేదే ఆయన తత్వం.పేదవాళ్లకు ఎంతోకొంత సహాయం చేయాలనేదే ఆయన మనస్తత్వం. 1986లో టీవీ రంగంలో అడుగుపెట్టాను.

దర్శకుడిగా, నిర్మాతగా 'లవ్‌ ఆల్‌ ఫస్ట్‌ సైట్‌' అనే టెలీఫిలిం తీశాను. అది హిట్‌ అవడంతో టీవీ రంగంలోని అన్ని విభాగాల్లో పనిచేశాను. 'కోడలా కోడలా కొడుకు పెళ్లామా', 'కస్తూరి' సీరియళ్లతో పాటు టీవీ ప్రోగ్రామ్స్‌ చేశారు. సినీ రంగంతో పాటు సమాజంలోని అసహాయులకు ఆసరాగా నిలవాలన్నదే ఆయన ఆశయం. ఆ దిశగా తనవంతు కృషి చేస్తున్నారు. సినీ కార్మికులు, సమాజంలోని పేదలను చూసి చలించిపోయాను.
వారికి అండగా ఉండాలన్న ఉద్దేశంతో మూడేళ్ల క్రితం 'మనం సైతం' గ్రూప్‌ ఏర్పాటు చేసి ఎంతో మందికి ఆసరాగా నిలుస్తున్నారు. ఇక ఇండస్ట్రీలో కాదంబరి చేస్తున్న కృషికి, సేవలకు ఇండస్ట్రీ పెద్దలకు కూడా తమ వంతు సహాయం అందిస్తున్నారు. అంతే కాదు సమాజంలో ఇలాంటి వాళ్లు తక్కువ ఉంటారని..అలాంటి వారికు తమ వంతు సహాయసహకారాలు అందిస్తే మరిన్ని మంచి పనులకు శ్రీకారం చుట్టిన వాళ్లమవుతామని పలువురు ఇండస్ట్రీ పెద్దలు అన్నారు.

ఇండస్ట్రీలో ప్రోడక్షన్ ఆసిస్టెంట్ పనిచేస్తున్న వెంకటేశ్వరరావు కూతురు నీలా బాగ్యలక్ష్మి ఫిట్ట్స్ తో బాధపడుతున్నారు. ఆ అమ్మాయి ఆపరేషన్ చేయడానికి 1/12 న ఆపరేషన్ ఉండగా..'మనం సైతం' ద్వారా రూ.25,000 లు అందించారు. ఈ కార్యక్రమంలో కాదంబరి కిరణ్ కుమార్, వల్లభనేని అనిల్, వినోదబాల, చిల్లార వేణు, రవిలు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com