బిత్తిరి సత్తి పై గుర్తు తెలియని దుండగుల దాడి..
- November 27, 2017
తీన్మార్ వార్తలు అనే షో ద్వారా సత్తి..పాపులర్ అయ్యాడు. డిఫరెంట్ గెటప్స్... మాట తీరుతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకొంటున్న బిత్తిరి సత్తి.. ఇటీవల వెండి తెరపై కూడా మెరుపులు మెరిపిస్తున్నాడు. వివిధ ఛానల్స్ లో యాంకరింగ్ చేస్తూ.. కెరీర్ లో తనదైన స్టైల్ లో దూసుకొని పోతున్న బిత్తిరి సత్తి అసలు పేరు కావాలి రవికుమార్. గత కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో తన బిత్తిరి వార్తల్లో నిలుస్తున్న సత్తి పై తాజాగా గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. హైదరాబాద్ లోని అతను పనిచేస్తున్న టీవీ కార్యాలయం ముందు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసినట్లు సమాచారం.
బిత్తిరి సత్తి తన కారు దిగి ఆఫీస్ లోకి వెళ్తున్న సమయంలో బైక్ మీద వచ్చిన ఇద్దరు దుండగులు సత్తిమీద హఠాత్తుగా దాడి చేసి.. జై భారత్.. జై భారత్ అనే నినాదాలు చేశారు ఈ దాడిలో సత్తికి బాగా దెబ్బలు తగిలాయి.. ఈ దాడిని చూసి అప్రమత్తమైన ఆఫీస్ సిబ్బంది ఆ దుండగులను పట్టుకున్నారు. ఆ దుండగులు దాడి చేసే సమయంలో బాగా తాగి ఉన్నట్లు.. తెలుస్తోంది. గాయపడిన సత్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ దుండగులను పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో అప్పగించారు.
తాజా వార్తలు
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







