షార్జాలో బస్ ఛార్జీల పెంపు
- November 28, 2017
డిసెంబర్ 1 నుంచి షార్జా సిటీ బస్ ట్రిప్స్కోసం వినియోగదారులు అదనంగా ఛార్జీలను చెల్లించాల్సి వస్తుంది. షార్జా రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ) వెబ్సైట్లో ఈ విషయాన్ని పేర్కొన్నారు. అన్ని సిటీ రూట్స్‌లోనూ, బస్ ఛార్జీలు పెరగబోతున్నట్లు ఆర్టిఎ వెల్లడించింది. 6 దిర్హామ్‌ల ఛార్జీకి బదులుగా ఇకపై 7 దిర్హామ్‌లను చెల్లించాల్సి ఉంటుంది. సాయెర్ కార్డులు కలవారు 4.5 దిర్హామ్‌లకు బదులుగా 5.5 దిర్హామ్‌లు చెల్లించాలి. నిర్వహణా వ్యయాలు పెరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు షార్జా ఆర్టిఎ వర్గాలు వెల్లడించాయి. ప్రతిరోజూ సిటీ బస్సుల్ని వినియోగిస్తుంటామని, ఈ ఛార్జీల పెంపు తమకు భారంగా మారనుందని పలువురు అభిప్రాయపడ్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







