ఇండియా, ఫిలిప్పీన్స్‌కి పెరిగిన ఒమన్‌ ఎయిర్‌ బ్యాగేజీ అలవెన్స్‌

- November 28, 2017 , by Maagulf
ఇండియా, ఫిలిప్పీన్స్‌కి పెరిగిన ఒమన్‌ ఎయిర్‌ బ్యాగేజీ అలవెన్స్‌

మస్కట్‌: ఒమన్‌ ఎయిర్‌, బ్యాగేజ్‌ అలవెన్స్‌ని తమ ప్రయాణీకుల కోసం అదనంగా పెంచింది. డిసెంబర్‌ 15 వరకు ఈ పెంపు అమల్లో ఉంటుంది. మస్కట్‌ నుంచి ఇండియా, ఫిలిప్పీన్స్‌కి వెళ్ళే విమానాల్లో ఈ బ్యాగేజీ పెంపు వర్తిస్తుంది. ఒమన్‌ ఎయిర్‌ ప్రస్తుతం 30 కిలోల బరువుని అనుమతిస్తుండగా, ఇకపై 40 కిలోల బ్యాగేజ్‌కి అనుమతిస్తుంది. ముంబై కోచి, చెన్నయ్‌, ఢిల్లీ, తిరువనంతపురం, కాలికట్‌, హైద్రాబాద్‌ మరియు బెంగళూరులకు ఈ పెంపు వర్తిస్తుంది. మస్కట్‌ నుంచి ఫిలిప్పీన్‌ రాజధాని మనీలాకు వెళ్ళేవారు 50 కిలోల బ్యాగేజ్‌ తీసుకెళ్ళవచ్చు. ఫిలిప్పీన్‌, ఇండియా తమకు చాలా పాపులర్‌ డెస్టినేషన్స్‌ అనీ, ఈ మార్గాల్లో ప్రయాణించేవారికోసం ఈ పెంపు నిర్ణయం తీసుకున్నామని ఒమన్‌ ఎయిర్‌ ప్రతినిథులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com