ఆఖరి టిక్కెట్‌కి 1 మిలియన్ డాలర్స్ బహుమతి
- November 28, 2017
ఆస్ట్రేలియన్ జాతీయుడొకరు 1 మిలియన్ డాలర్ బహుమతిని గెల్చుకున్నారు. దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్‌ని గెలుచుకుని అందర్నీ ఆశ్చర్యపరిచారు జెరెమి కె అనే వ్యక్తి. పెర్త్ నుంచి బ్రెజిల్‌కి వెళుతూ, టిక్కెట్ కౌంటర్‌లో మిగిలిన ఒకే ఒక్క టిక్కెట్ (258 సిరీస్ 2380 నెంబర్) కొనుగోలు చేశారు. ఆ టిక్కెట్‌కే దుబాయ్ డ్యూటీ ఫ్రీ రఫాల్‌లో బంపర్ ఆఫర్ తగిలింది. 38 ఏళ్ళ జెరెమీ కె మాట్లాడుతూ, ఇంత పెద్ద బహుమతిని తాను ఊహించలేదని చెప్పారు. ఐటీ కంపెనీలో బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నారాయన. ఇంకో వైపున ఇటలీ జాతీయుడొకరు బిఎండబ్ల్యు ఆర్ నైన్ టి స్క్రాంబ్లర్‌ని గెల్చుకున్నారు. ఆల్బర్టో స్ట్రింగల్ అనే 45 ఏళ్ళ వ్యక్తి దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్‌లో విరివిగా పాల్గొంటుంటారు. ఓ సిరామిక్ కంపెనీలో సేల్స్ ఏరియా మేనేజర్‌గా పనిచేస్తున్నారు. మరో బహుమతిగా బిఎండబ్ల్యు ఆర్ నైన్ టి అర్బన్ మోటర్ బక్‌ని గెల్చుకున్నారు. డేవిడ్ కింగెన్ ఆ విజేత.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష