చెప్పిన డేట్ కే విడుదల కానున్న 'మిడిల్ క్లాస్ అబ్బాయి'

- November 28, 2017 , by Maagulf
చెప్పిన డేట్ కే విడుదల కానున్న 'మిడిల్ క్లాస్ అబ్బాయి'

తెలుగు ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకు వెళ్తున్న నేచురల్ స్టార్ నాని దిల్ రాజు నిర్మాణంలో .. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'మిడిల్ క్లాస్ అబ్బాయి' సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం టీజర్, టైటిల్ సాంగ్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతుంది. లవ్, ఎంట్రటైన్ మెంట్ చిత్రాలకే ప్రాధాన్యత ఇస్తూ నాని గత నాలుగు సంవత్సరాల నుంచి మంచి విజయాలు సాధిస్తున్నాడు.
అయితే 'మిడిల్ క్లాస్ అబ్బాయి' సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 21వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. 22 వ తేదీన అఖిల్ 'హలో' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో 23వ తేదీన అల్లు శిరీష్ సినిమా 'ఒక్క క్షణం' రిలీజ్ చేయాలని అల్లు అరవింద్ భావించారు. ఈ మూడు సినిమాలు ఒక్కరోజు తేడాతో వస్తే కలెక్షన్ల పరంగా బాగా దెబ్బపడుతుందని భావించి ఒక వారం రోజుల ముందుగా 'మిడిల్ క్లాస్ అబ్బాయి' ని విడుదల చేసుకోమని అల్లు అరవింద్ కోరినట్టుగా వార్తలు వచ్చాయి.
 
కానీ నానికి ఉన్న క్రేజ్ ని ఆధారంగా చేసుకొని దిల్ రాజు తన నిర్ణయాన్ని మార్చుకోలేదనేది తాజా సమాచారం. 'మిడిల్ క్లాస్ అబ్బాయి' వచ్చేనెల 21నే రావడం ఖాయమని తెలిసి, అల్లు అరవింద్ .. 'ఒక్క క్షణం' సినిమాను 29వ తేదీకి వాయిదా వేసుకున్నారని తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com