మహిళలకు 33 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం : కేటీఆర్
- November 28, 2017
హైదరాబాద్ : చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లకు టీఆర్‌ఎస్ పార్టీ కట్టుబడి ఉందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. చట్టసభల్లో మహిళల ప్రాధాన్యతపై జీఈఎస్ వేదిక వద్ద మీడియా అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. మహిళలకు 33 శాతం బిల్లును పార్లమెంట్‌లో పెడితే తమ ప్రభుత్వం మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. ఈ విషయమై ఇప్పటికే శాసనసభలో తీర్మానం చేశామని కేటీఆర్ గుర్తు చేశారు. మహిళా శాసనసభ్యుల సంఖ్య కూడా తక్కువగా ఉందన్నారు. మంత్రివర్గంలో మహిళలకు చోటుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారని మంత్రి తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







