భారతీయ రోగికి అత్యవసరంగా "బాంబే గ్రూప్" రక్తం అవసరం

- November 29, 2017 , by Maagulf
భారతీయ రోగికి  అత్యవసరంగా

 కువైట్:' పురుషులందు ...పుణ్య పురుషులు వేరయా అన్నట్లు ' ...రక్త సమూహాలలో బొంబాయి రక్తం వేరట... ప్రస్తుతం ఒక రోగికి ఆ రక్తం అవసరం ఏర్పడింది. అడాన్ హాస్పిటల్లో చేరిన భారతీయ రోగికి  అత్యవసరంగా రక్తంలో ప్రత్యేక గ్రూప్  అవసరం ఏర్పడింది. ఈ గ్రూప్ రక్తం అత్యంత అరుదుగా లభ్యమవుతుందని ఆస్పత్రివర్గాలు తెలిపాయి. ఈ రక్తదాతలు తమ రక్తాన్ని ఇవ్వదలిచితే వెంటనే రఘుబాయి 6999 7588, రణజిత్ 5151 0076 లేదా యాసర్ 6676 9981 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు. ఈ ప్రత్యేక  బొంబాయి రక్తం గలవారు మాత్రమే ఫోన్ కాల్ చేయమని రోగి బంధువులు అభ్యర్థిస్తున్నారు.  " బాంబే  బ్లడ్ గ్రూప్" అని పిలవబడే ఈ రక్త సమూహం అనేది భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో మాత్రమే లభిస్తుంది.  7,600 మంది ప్రజలలో ఒక్కరికి మాత్రమే ఆ రక్తం లభించడంతో ఆ రక్తదాత కోసం రోగి బంధువులు పరితపిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com