పద్మావతి సినిమాకి మరో అవార్డ్‌

- November 30, 2017 , by Maagulf
పద్మావతి సినిమాకి మరో అవార్డ్‌

పద్మావతి చిత్రంలో రాణి పద్మావతి పాత్ర పోషించిన దీపిక పదుకొణే ఈ మధ్య ఎక్కువగా వార్తలలో నిలుస్తూ వస్తుంది. పద్మావతి సినిమాని ఎవ్వరు అడ్డుకోలేరని ఓ స్టేట్‌మెంట్ ఇవ్వడంతో రాజ్ పుత్ కర్ణిసేన ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ముక్కు కోస్తామని వార్నింగ్ ఇచ్చింది. అంతేకాదు ఆమె తల చేస్తే నగదు బహుమతి ఇస్తామని కూడా ప్రకటించింది. ఇలాంటి నేపధ్యంలో దీపిక భారీ సెక్యూరిటీ మధ్య సినిమా ప్రమోషన్స్ చేస్తూనే ఉంది. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అన్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రీసెంట్ గా మోస్ట్ పాపులర్ ఇండియన్ యాక్ట్రెస్ ఇన్ సోషల్ మీడియా అవార్డు ఇచ్చి సత్కరించింది. తాజాగా ఇన్‌స్ట్రాగ్రామ్ యాజమాన్యం కూడా దీపికకి స్పెషల్ ట్రోఫీని అందించినట్టు తెలుస్తుంది. ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఎక్కువ ఫాలోవర్స్ పెంచుకున్న కారణంగా దీపికకి ఈ అవార్డు ఇచ్చినట్టు సమాచారం. బాలీవుడ్‌లో ఓ వెలుగు వెలుగుతున్న దీపిక హాలీవుడ్‌లోను తన అదృష్టం పరీక్షించుకున్న సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com