'రారండోయ్..' సినిమా రీమేక్ లో నిఖిల్..
- November 30, 2017
అక్కినేని నాగ చైత్యన , రకుల్ ప్రీతి సింగ్ జంటగా నటించిన 'రారండోయ్ వేడుక చూద్దాం' చిత్రం ఎలాంటి హిట్ సాధించిందో తెలియంది కాదు. కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించిన ఈ మూవీ , ఇప్పుడు కన్నడలో రీమేక్ అవుతుంది. ఈ రీమేక్ లో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ హీరోగా నటిస్తున్నాడు. కన్నడ లో 'సీతారామ కళ్యాణం' పేరుతో తెరకెక్కుతుంది. ఈ చిత్రాన్ని కుమారస్వామి నిర్మించబోతున్నాడు.
నిఖిల్ గత ఏడాది రూ.75 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన 'జాగ్వార్' సినిమాతో హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. ఆ సినిమా కన్నడ తో పాటు తెలుగులోనూ రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. తొలి సినిమాతో యాక్షన్ హీరో అయిపోదామని చూసిన నిఖిల్ కు ఎదురు దెబ్బ తగలడం తో ఇప్పుడు ఫ్యామిలీ కథ తో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. మరి నిఖిల్ కు ఈ చిత్రం ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







