ఓక్కి తుపాను...లక్షద్వీప్ అతలాకుతలం
- December 01, 2017
చెన్నై: ఓక్కి తుపాను తమిళనాడు, లక్షద్వీప్‌ను అతలాకుతలం చేస్తోంది. భీకరమైన ఈదురుగాలులు, ఎగిసిపడుతున్న అలలతో తీర ప్రాంతం భీకరంగా ఉంది. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఇప్పటివరకూ 8 మంది మరణించగా 90 మంది ఆచూకీ గల్లంతయింది. తమిళనాడులో పరిస్థితి మరింత తీవ్రంగా ఉండడంతో 7 జిల్లాల్లోని పాఠశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.
కన్యాకుమారి వద్ద సముద్రం ఉప్పొంగింది. ప్రఖ్యాత సుచీంద్రం ఆలయం లోపలికి సముద్రపు నీరు చొచ్చుకువచ్చింది. ఆలయంలోని ముఖమంటపం మొత్తం నీరు నిండిపోయింది. దీంతో ఆలయాన్ని అధికారులు మూసేశారు.
లక్షద్వీప్‌లో సముద్రం హోరెత్తుతోంది. అలలు ఎగిసిపడుతున్నాయి. తీరప్రాంతంలోని రిసార్టుల్లోకి సముద్రపు నీరు ప్రవేసించింది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







