రాహుల్ కు కోలుకోలేని షాక్ ఇచ్చిన బీజేపీ
- December 01, 2017
లక్న: కాంగ్రెస్ చీఫ్ పగ్గాలు చేపట్టనున్న రాహుల్ గాంధీకి యూపీ స్ధానిక ఎన్నికలు గట్టి షాక్ ఇచ్చాయి. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న అమేథి నగర పంచాయితీలో బీజేపీ చేతిలో కాంగ్రెస్ పరాజయం పాలైంది. వేయికి పైగా ఓట్ల తేడాతో బీజేపీ అమేథిలో గెలుపొందింది. అమేథి లోక్‌సభ నియోజకవర్గం నుంచి రాహుల్ గాంధీ ఎన్నికైన విషయం తెలసిందే. దశాబ్ధాలుగా కాంగ్రెస్‌కు కంచుకోటగా ఈ నియోజకవర్గానికి పేరుంది.
ఇటీవల జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అమేథి పరిధిలోని నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లనూ ఆ పార్టీ కోల్పోయింది. అమేథితో పాటు సోనియా గాంధీ ప్రాతినిథ్యం వహిస్తున్న రాయ్ బరేలీలోనూ బీజేపీ స్ధానిక పోరులో ఘనవిజయం సాధించింది.
అమేథి నగర్ పంచాయితీలో బీజేపీ అభ్యర్థి చంద్రమా దేవి 1035 ఓట్ల తేడాతో విజయం సాధించారు. యూపీ స్ధానిక ఎన్నికల్లో అత్యధిక మేయర్ స్ధానాలను, నగర పంచాయితీలను బీజేపీ కైవసం చేసుకుంది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







