ప్రధాని మోడీకి నోటీసులు పంపిన నిస్సాన్
- December 01, 2017
ఢిల్లీ: జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ నిస్సాన్ మోటార్స్ భారత్‌పై ప్రోత్సాహకాల బకాయిలు చెల్లించలేదని ఆరోపిస్తూ ఏకంగా రూ. 5వేల కోట్లకు దావా వేసింది. దీనికి సంబంధించి గతేడాదే ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లీగల్ నోటీసులు జారీ చేసినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ వ్యక్తి తెలిపారు. ఈ కేసులో విచారణ చేపట్టాలని కోరుతూ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్‌ను నిస్సాన్ కోరింది.
కాగా 2008లో నిస్సాన్ తమిళనాడులో కార్ల తయారీ ప్లాంట్‌ను ప్రారంభించింది. ఆ సమయంలో పన్ను రీఫండ్‌తో సహా పలు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు తమిళనాడు ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు నిస్సాన్, తమిళనాడు ప్రభుత్వం మధ్య ఒప్పందం కూడా కుదిరింది. అయితే అప్పటి నుంచి తమకు ఎలాంటి ప్రోత్సాహకాలు అందలేదని నిస్సాన్ చెబుతోంది. బకాయిలు చెల్లించాలని పలుమార్లు ప్రభుత్వాన్ని కోరినా సమస్య పరిష్కారం కాకపోవడంతో తాము ఈ విషయాన్ని 2015లో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొంది.
దీనిపై నిస్సాన్ ఛైర్మన్ కార్లోస్ గోస్న్ గతేడాది మార్చిలో ప్రధాని మోడీకి స్వయంగా లేఖ రాశారని.. బకాయిలు చెల్లించేలా చూడాలని కోరినట్లు సంస్థ తెలిపింది. అయినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోవడంతో తాము ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్‌ను ఆశ్రయించినట్లు పేర్కొంది. దీంతో గతేడాది జులైలో ప్రధాని మోడీకి లీగల్ నోటీసులు జారీ అయ్యాయి.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







