కాపు రిజర్వేషన్ బిల్లును ఆమోదించనున్న కేబినెట్

- December 01, 2017 , by Maagulf
కాపు రిజర్వేషన్ బిల్లును ఆమోదించనున్న కేబినెట్

అమరావతి: కాసేపట్లో ఏపీ కేబినేట్ సమావేశం జరగనుంది. ఈ సందర్బంగా కాపుల రిజర్వేషన్ బిల్లును కేబినెట్ ఆమోదించనుంది. ఇప్పటికే కాపు రిజర్వేషన్ బిల్లును న్యాయ నిపుణులు పరిశీలించిన నేపధ్యంలో బిల్లును కేబినెట్ ఆమోదించనుంది. అలాగే బోయ కులస్తులను ఎస్టీల్లో చేర్చే బిల్లును కూడా కేబినెట్ ఆమోదించనుంది. కాగా... మరో రెండు బిల్లులను అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అవసరమైతే ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని రద్దు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com