పైలట్ లేని కారణంగా నిలిచిన విమానం.!
- December 02, 2017
పైలట్ లేకపోవడంతో విమానం దాదాపు ఏడు గంటల పాటు ఆలస్యమైంది. దీంతో విసిగిపోయిన ప్రయాణికులు ముంబయిలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆందోళనకు దిగారు. ముంబయి నుంచి అహ్మదాబాద్ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం శనివారం తెల్లవారుజామున బయలుదేరాల్సి ఉంది. అయితే.. సమయానికి పైలట్ లేకపోవడంతో విమానం ఆలస్యమైంది. దాదాపు ఏడు గంటల పాటు ప్రయాణికులు విమానాశ్రయంలో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కనీసం వేచి ఉండేందుకు వసతి, తినడానికి ఆహారం కూడా ఇవ్వకుండా ఎయిరిండియా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ 200 మంది ప్రయాణికులు ఆందోళనకు దిగారు. తొలుత విమానం గంట ఆలస్యంగా బయలుదేరుతుందని చెప్పారు. కానీ తర్వాత విమానం నడిపేందుకు పైలట్ అందుబాటులో లేరని చెప్పి ఏడు గంటలు ఆలస్యం చేసినట్లు ప్రయాణికులు తెలిపారు. ఉదయం 9 గంటల సమయంలో పైలట్ రావడంతో విమానం బయలుదేరింది.
తాజా వార్తలు
- పేపర్ లీక్‌ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!







