శింబుపై రెడ్‌కార్డ్
- December 02, 2017
నటుడు శింబు అంటే సంచలనానికి మారుపేరు. ఆ మధ్య నయనతార, హన్సికతో ప్రేమాయణంతో వార్తల్లోకెక్కారు. ఆ తరువాత బీప్ సాంగ్ అంటూ వివాదాల్లో చిక్కుకున్నారు. తాజాగా అన్భానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్ర నిర్మాత నుంచి ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. శింబు న టించిన ఈ చిత్రం ఘోర పరాజయం పొందడంతో నిర్మాత మైఖెల్ రాయప్పన్ తనకు రూ.20 కోట్లు నష్టం వచ్చిందని.. అందుకు శింబు కారణం అని పేర్కొన్నారు. ఏమైనా నేను చూసుకుంటాను, నాది బాధ్యత అని శింబు మాట ఇచ్చి మోసం చేశారని నిర్మాతల మండలిలో ఆయన ఫిర్యాదు చేశారు. శింబు సరిగా షూటింగ్‌కు రాలేదని, కథను కూడా మార్చేశారని ఆరోపణలు గుప్పించారు.
నిర్మాత ఆరోపణలకు స్పందించాల్సిందిగా మీడియా ప్రతినిధుల ప్రశ్నకు తాను ఏమీ స్పందించాల్సిన అవసరం లేదని శింబు తెలిపాడు. తనకు నిర్మాత రూ.3.5 కోట్లు పారితోషికం ఇవ్వాలని, ముందు ఆ మొత్తాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. దీనిపై నడిగర్ సంఘంలో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. తనపై రెడ్ కార్డ్ వేస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలో తనకు తెలుసని శింబు అన్నారు. ఇలా ఉండగా శింబుపై రెడ్‌కార్డ్ వేసే అవకాశం ఉందనే ప్రచారం జరగడంతో మణిరత్నం చిత్రం నుంచి ఆయన్ని తొలగించి మరో నటుడిని ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్‌ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







