శబరిమల: ఉప్పొంగిన పంబా నది..భక్తుల కష్టాలు
- December 02, 2017
శబరిమల: ఓఖీ తుఫాన్ దెబ్బకు కేరళ రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. భారీ వర్షాలు, ఈదురుగాలులతో కేరళ వణికిపోతోంది. ముఖ్యంగా సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శబరిమలలో పరిస్థితి దారుణంగా ఉంది. భారీ వర్షాలకు పంబా నది ఉప్పొంగి రాకపోకలు సాగడం లేదు. దీంతో నదిలో స్నానాలు చెయ్యవద్దని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. నది ప్రవాహం తీవ్రంగా ఉండటంతో భక్తుల ఇబ్బందిపడకుండా ఉండేందుకు గాను వారు ముందుకు వెళ్ళకుండా అధికారులు అపివేశారు. మరోపక్క నడకదారి కూడా తీవ్రంగా దెబ్బతింది. ఇంకోవైపు ఈదురుగాలులతో భారీ వృక్షాలు నేలకొరగడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఎప్పుడు ఏ వృక్షం విరిగిపడుతుందో తెలియకుండా ఉంది. కొండపైకి వచ్చే భక్తులు నానా ఇక్కట్ల పాలవుతున్నారు. ఈ పరిణామంతో రాత్రి సమయంలో రాకపోకలను అధికారులు పూర్తిగా నిలిపివేశారు. మరో రెండు రోజుల పాటు వర్షం ముప్పు కొనసాగుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేరళ సర్కారు సూచించింది. ఇంతటి వర్షంలోనే కొందరు భక్తులు అయ్యప్ప దర్శనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







