ఏపీలో భారీ వర్షాలు.. ISRO హెచ్చరిక
- December 04, 2017
విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారి... ఏడో తేదీ నాటికి మధ్య, ఉత్తర కోస్తాల దిశగా వస్తుందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి ఇస్రో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. ఇస్రో అంచనా ప్రకారం ఈ నెల ఏడో తేదీ నుంచి వర్షాలు ప్రారంభమయ్యే అవకాశముంది. వాయుగుండం ప్రభావంతో తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఈ నెల 8న భారీ వర్షాలు కురిసే అవకాశముందని సోమవారం నాటి మోడల్స్ ప్రకారం వాతావరణ శాఖ అంచనా వేసింది.
శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఏడో తేదీ సాయంత్రం నుంచి పదో తేదీ వరకు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ప్రధానంగా విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో తీరం వెంబడి బలమైన గాలులు వీచే అవకాశముంది. అయితే తీరం దిశగా వచ్చేసరికి తీవ్ర వాయుగుండం బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశముందని విశ్లేషించింది. ఇస్రో హెచ్చరిక నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
సీఎం కార్యాలయ అదనపు కార్యదర్శి రాజమౌళి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
తాజా వార్తలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!







