ఆది హీరోగా 'గరం' సినిమా

- November 15, 2015 , by Maagulf
ఆది హీరోగా 'గరం'  సినిమా

బాలనటుడుగా పరిచయం అయి ఆ తరువాత డబ్బింగ్ ఆర్టిస్టుగా మారి ఆపై హీరోగా మారిన సాయికుమార్ జీవితంలో ఎన్నో ట్విస్టులు ఉన్నాయి. మారుతున్న పరిస్థుతులకు అనుగుణంగా ప్రస్తుతం నెగిటివ్ పాత్రలను చేస్తున్న సాయికుమార్ నిర్మాతగా మారడం ఆశ్చర్యం కలిగిస్తోంది అంటూ ఫిలింనగర్ లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. తన కొడుకు ఆదిని హీరోగా పెట్టి సాయికుమార్ తన భార్య సురేఖను నిర్మాతగా మార్చి ప్రస్థుతం 'గరం' అనే సినిమాను తీస్తున్నాడు. ఈ సినిమాలో ఆదికి జంటగా ఆదా శర్మ నటిస్తోంది. ఈ సినిమాను ఒక పాయింట్ తో పూర్తి కమర్షియల్ సినిమాగా తీసి ఆదిని హీరోగా నిలబెట్టి తాను నిర్మాతగా నిలబడటానికి సాయికుమార్ పెద్ద ప్రయత్నమే చేస్తున్నాడు అంటూ ఫిలింనగర్ లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రొడక్షన్ రిస్కే అయినా తన తండ్రిని ఒప్పించి ఆది ఈ సినిమాను పట్టుపట్టి తీయిస్తున్నాడని ఫిలింనగర్ గాసిప్. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. అయితే సినిమా తియ్యడం వేరు దానిని మార్కెట్ చేసుకోవడం వేరు అనే పరిస్థుతుల మధ్యలో ప్రస్తుత టాలీవుడ్ సినిమా రంగం ఉన్న నేపధ్యంలో ఈ ప్రయత్నాలలో ఎంత వరకు సాయికుమార్ విజయాన్ని అందుకుంటాడు అనే కామెంట్స్ ఫిలింనగర్ లో వినిపిస్తున్నాయి. దీనికితోడు ఈమధ్య ఆది నటించిన సినిమాలు అన్నీ పరాజయం చెందిన నేపధ్యంలో ఆది సినిమాలకు బయ్యర్లలో క్రేజ్ లేకపోవడంతో ఈ 'గరం' గరంగరంగా ఎంతవరకు మార్కెట్ అవుతుంది అన్న మాటలు వినిపిస్తున్నాయి.అయితే తన మొండి ధైర్యాన్ని కొనసాగిస్తూకమర్షియల్ హంగులకు ఏ మాత్రం తగ్గకుండా సాయికుమార్ ఈసినిమాను నిర్మించాడని టాక్. విలక్షణ దర్శకుడు మదన్ దర్శకత్వ ప్రతిభతో పాటు ఫారిన్ లొకేషన్ లో పాటలు తీయడం హీరోయిన్ ఆదా శర్మ గ్లామర్ ఎంత వరకు ఈసినిమాను రక్షిస్తుందో త్వరలోనే తేలనున్నది అని అంటున్నారు..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com