ఇక రైల్వే టికెట్ పై రివార్డు.!
- December 07, 2017
నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు రైల్వే శాఖ ప్రయాణికులకు మరో సదుపాయాన్ని కల్పిస్తోంది. నగదురహిత మాధ్యమాల ద్వారా టికెట్ కొనుగోలు చేసిన వారికి రివార్డులు ఇవ్వనుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇప్పటికే క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల ద్వారా నెలవారీ ట్రావెల్ పాస్‌లను కొనుగోలు చేసిన వారికి రైల్వేశాఖ 0.5శాతం డిస్కౌంట్ అందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీ ప్రయాణికులకు కూడా ఈ సదుపాయాన్ని విస్తరిస్తోంది. దీంతో పాటు నగదు రహిత టికెట్ల కొనుగోలుపై ఉచిత బీమా సౌకర్యం కూడా కల్పించనుంది. 'నగదు వినియోగాన్ని వీలైనంత వరకు తగ్గించేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. అందుకే ప్రయాణికులకు ఇలాంటి ప్రోత్సాహకాలు అందిస్తున్నాం. వీటి వల్ల వచ్చే ఆర్థికభారాన్ని రైల్వేశాఖ భరిస్తుంది' అని రైల్వేబోర్డు ఓ ఆంగ్ల మీడియాకు తెలిపింది. పెద్దనోట్ల రద్దు నాటికి రైల్వే టికెట్లలో 20శాతం ఉన్న డిజిటల్ లావాదేవీలు ప్రస్తుతం 60శాతానికి పెరిగాయి. అంతకుముందు ఐఆర్‌సీటీసీ పోర్టల్ ద్వారానే డిజిటల్ లావాదేవీలను జరపగా.. పెద్దనోట్ల రద్దు తర్వాత నుంచి దేశవ్యాప్తంగా టికెట్ కౌంటర్ల వద్ద పాయింట్ ఆఫ్ సేల్స్ మిషన్లు ఏర్పాటుచేసింది రైల్వేశాఖ. వీటి వద్ద కార్డులతో పాటు డిజిటల్ వాలెట్ల ద్వారా కూడా టికెట్లను కొనుగోలు చేసుకునే సదుపాయం కల్పించింది.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







