వారసుడి రాకతో శాపం నుంచి మైసూర్ రాజ వంశానికి విముక్తి
- December 08, 2017
నాలుగు శతాబ్దాల ఎదురుచూపుల అనంతరం మైసూరు రాజవంశానికి వారసుడొచ్చాడు. యువరాజు వదువీర్ దంపతులకు కుమారుడు జన్మించడంతో సుమారు 400 ఏళ్ల నాటి శాపానికి విముక్తి కలిగిందని మైసూరు రాజ కుటుంబ వర్గాలు చెబుతున్నాయి. దీంతో రాజవంశంతో పాటు మైసూరు అంతటా సంబరాలు అంబరాన్నంటాయి. యువరాణి త్రిషికా బుధవారం రాత్రి పండంటి బాబుకు జన్మనిచ్చారు. వివరాల్లోకి వెళితే క్రీ.శ 1600సంవత్సరంలో అప్పటి మైసూరు రాజు విజయనగర సామ్రాజ్యంపై దండెత్తి రాజ్యాన్ని కైవసం చేసుకున్నారు. విజయనగర రాజు తిరుమల రాజుతో పాటు ఆయన భార్య అలివేలమ్మను బంధించాలని సైనికులను పంపారు. వారి నుంచి తప్పించుకునేందుకు అలివేలమ్మ సమీపంలోని మాలతి గ్రామంలో తలదాచుకున్నారు. విషయం తెలుసుకున్న సైనికులు ఆమెను చంపేందుకు ప్రయత్నించగా, ఆమె ఆగ్రహంతో మైసూరు రాజవంశానికి సంతాన భాగ్యం కలగదని శపించి కావేరీ నదిలో దూకి తనువు చాలించింది. అప్పటి నుంచి మైసూరు రాజ వంశీయులకు పిల్లలు కలగడం లేదు. దీంతో బంధువుల్లో యోగ్యుడైన యువకుడిని దత్తత తీసుకుని మహారాజుగా ప్రకటిస్తూ వస్తున్నారు. ఇప్పుడు నాలుగు శతాబ్దాల తరువాత యువరాజు వదువీర్‌కు కుమారుడు జన్మించడంతో శాపవిముక్తి కలిగినట్లైంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







