కువైట్ దేశానికి తదుపరి రాయబారి కె. జీవా సాగర్
- December 08, 2017
కువైట్ : మన తెలుగుతేజం ఎడారి దేశంలో రాయబారిగా వికసించనుంది. కువైట్ దేశానికి తదుపరి రాయబారిగా భారఃదేశానికి చెందిన కె.జీవ సాగర్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ 1991 బ్యాచ్ కు చెందిన ఆయన ఆంధ్రప్రదేశ్ కు చెందినవారు. ఈ మేరకు భారతదేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ గురువారం ఒక పత్రికా ప్రకటనలో అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం న్యూఢిల్లీలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖలో సంయుక్త కార్యదర్శి గా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో కె.జీవ సాగర్ ఘనా దేశానికి ఇండియన్ హై కమిషనర్ గా పనిచేశారు. బుర్కినా ఫాసో రిపబ్లిక్ మరియు టోగో రిపబ్లిక్ కు భారత రాయబారిగా పనిచేశారు, . ఆయన త్వరలోనే కువైట్ రాయబారిగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టనున్నారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







