మ్యాక్స్ హాస్పిటల్ లైసెన్స్ రద్దు!
- December 08, 2017
ఢిల్లీలోని మ్యాక్స్ హాస్పిటల్ లైసెన్సును రద్దు చేస్తున్నట్లు దిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ వెల్లడించారు. ఇద్దరు కవల పిల్లలు చనిపోయారని చెప్పి వారిని ప్లాస్టిక్ బ్యాగ్‌లో పెట్టి తల్లిదండ్రులకు ఇచ్చిన చిన్నారుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన హాస్పిటల్ తీరు ఆమోదయోగ్యమైనది కాదని, అందుకే హాస్పిటల్ లైసెన్సు రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఇప్పటి నుంచి ఇక ఆ హాస్పిటల్‌లో రోగులకు చికిత్స అందిచడానికి వీల్లేదని తెలిపారు. ఇటీవల మ్యాక్స్ హాస్పిటల్‌లో జన్మించిన ఇద్దరు కవలలు చనిపోయినట్లు చెప్పి వారి మృతదేహాలను ప్లాస్టిక్ బ్యాగ్‌లో పెట్టి తల్లిదండ్రులకు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే వారికి అంత్యక్రియలు చేసేందుకు తీసుకెళ్తుండగా అందులో ఉన్న ఓ బిడ్డలో కదలికలు రావడం తండ్రి గమనించాడు. వెంటనే ఆ చిన్నారిని చికిత్స నిమిత్తం వేరే ఆసుపత్రిలో చేర్పించారు. అయితే.. ప్లాస్టిక్ బ్యాగ్‌లో పెట్టి ఇవ్వడంతో బతికి ఉన్న చిన్నారికి కూడా ఇన్‌ఫెక్షన్ సోకింది. దీంతో ఆ చిన్నారి కూడా బుధవారం మృతి చెందింది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







