టోక్యో ప్రేయర్ హాల్ లో హత్య, 3 మృతి
- December 08, 2017
టోక్యోలోని ప్రముఖ ఆరాధనా స్థలంలో జరిగిన కత్తిపోట్లలో ప్రధాన పూజారితో సహా ముగ్గురు మరణించారని పోలీసులు తెలిపారు. సమురారు కత్తితో ఆమె సోదరుడే దాడి చేసినట్లు కనిపిస్తోందని ఆ తర్వాత ఆ సోదరుడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. ఈ దాడిలో పూజారి వెంట వుంటే మహిళా సహాయకురాలు కూడా మరణించారు. డ్రైవర్ గాయపడ్డాడని టోక్యో మెట్రోపాలిటన్ పోలీసులు తెలిపారు. ఈ కత్తిపోట్లకు గల కారణాలు ఏంటో తెలియరాలేదు. బహుశా పూజారికి, ఆమె సోదరుడికి మధ్య ఘర్షణ జరిగి వుంటందని పేర్కొంటున్నారు. గురురవారం రాత్రి నగకో టమియోకా(58) తన కారు నుండి బయటకు వస్తుండగా ఈ దాడి జరిగిందని పోలీసులు తెలిపారు. సాధారణంగా జపాన్ పూజారులు ఆరాధనా స్థలానికి లేదా ఆలయాలకు చెందిన భూముల్లోనే నివసిస్తారు. పూజారి సోదరుడు షినెగ టమియోకా (56) ఆయనతో వచ్చిన మరో అనుచరుడు కలిసి ఆమె ఇంటివెనక దాక్కుని కత్తిపోట్లకు పాల్పడ్డారని పోలీసులు చెప్పారు. సంఘటనా స్థలంలో కత్తి మరకలతో వున్న కత్తి ఒకటి, రెండు చిన్న కత్తులు కనిపించాయిన పోలీసులు చెప్పారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







