దుబాయ్ యువకుల దురాగతం....వేశ్యలనే దోచుకున్నారు
- December 09, 2017
దుబాయి : ' అతి రహస్యం ..బట్టబయలని ' మన తెలుగు సామెత.. బతుకుతెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన ఆ యువతులు పార్ట్ టైం వృత్తిగా అడ్డదారిలో డబ్బు సంపాదించాలనుకొన్నారు వెలుగులోనికి రానీయకుండా వేశ్యాగృహాన్నినడుపుతూ వారు నేరానికి పాల్పడ్డారు..ఈ నేపథ్యంలో విటులుగా ఆ వేశ్యా గృహానికి వెళ్లి 9మంది యువకులు వారి వద్ద దొంగతనం చేయడమే కాక ఆ యువతులతో కొందరిపై అత్యాచారం జరిపేరు. తేలు కుట్టిన దొంగలు మాదిరిగా ఆ యువతులు ఎవరికీ చెప్పుకోలేరని ఆ 9మంది యువకులు దర్జాగా అక్కడినుంచి వెళ్ళిపోయారు. కూడబెట్టిన డబ్బు పోవడమే కాకుండా తమపై అఘాయిత్యాలు జరగడంతో విధిలేని పరిస్థితులలో తమకు జరిగిన అన్యాయం గూర్చి పోలీసులకు సమాచారం అందించాల్సిన సంకటం ఎదురైంది. శుక్రవారం తెల్లవారు జామున 3గంటల ప్రాంతంలో ఫోన్ వచ్చింది. తమ అపార్ట్‌మెంట్‌లో దొంగతనం జరిగిందని, తమలో కొందరిపై నిందితులు అత్యాచారం సైతం ఫోన్ ద్వారా తెలిపి భోరుమన్నారు. బాధితులు తెలిపిన వివరాలలో ఫ్లాట్‌లోకి వెళ్లి చూసిన పోలీసులకు అక్కడ అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించబడుతున్నట్లు అక్కడ వాతావరణం చూసి గ్రహించారు.పోలీసులు వెళ్లేసరికి అపార్ట్‌మెంట్‌లో 6గురు యువతులు , ఓ వ్యక్తి ఉన్నారు. తాము అక్రమంగా వ్యభిచారం చేస్తున్నామనీ, అయితే 9 మంది ఒకేసారి గురువారం రాత్రి తమ అపార్ట్‌మెంట్‌కు వచ్చారని తెలిపారు. అకస్మాత్తుగా తమను బంధించి, దాచుకొన్న డబ్బంతా తమ ముందే వాటాలు పంచుకొని అక్కడినుంచి ఉడాయించారని తమలో ఇద్దరిపై అత్యాచారం కూడా చేశారని వాపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పనిలో పనిగా పార్ట్ టైం వ్యభిచారం చేస్తున్నందుకు వారిపై కూడా మరో కేసు నమోదుచేశారు. శుక్రవారం ఈ దారుణానికి ఒడిగట్టిన తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో అయిదుగురు దుబాయి పౌరులు కాగా మరో నలుగురు ఆసియన్ దేశస్థులు. వీరిని వచ్చే వారంలో కోర్టు ముందుకు హాజరుపరచనున్నారు.
తాజా వార్తలు
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!







