వాట్సాప్‌లో మరిన్ని కొత్త ఫీచర్లు!
- December 11, 2017
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో త్వరలో కొత్త ఫీచర్లు రాబోతున్నాయి. ఇప్పటికే వీడియో కాలింగ్, వాయిస్ కాలింగ్, స్టేటస్ తదితర ఫీచర్లు ఉన్న యాప్‌లో ఇటీవల డిలీట్ ఆప్షన్ వచ్చింది. ఇప్పుడు వాట్సాప్‌లో మరో మూడు ఫీచర్లను యాడ్ చేయబోతున్నారు. వాటిలో ట్యాప్ టు అన్‌బ్లాక్, షేక్ టు రిపోర్ట్, ప్రైవేట్ రిప్లైస్ ఫీచర్లు ఉన్నాయి.
ట్యాప్ టు అన్‌బ్లాక్
వాట్సాప్ ఎవరినైనా బ్లాక్ చేయాలంటే సెట్టింగ్స్‌లోని ప్రైవసీ ఆప్షన్‌లోకి వెళ్లి బ్లాక్ చేయాలి. ఆ తర్వాత ఆ నెంబర్‌ను అన్‌బ్లాక్ చేయాలంటే.. మళ్లీ సెట్టింగ్స్‌లోని ప్రైవసీ ఆప్షన్‌లోకి వెళ్లాలి. కానీ ఈ ట్యాప్ టు అన్‌బ్లాక్ ఆప్షన్‌తో కేవలం నెంబర్‌పై లాంగ్ ప్రెస్ చేస్తే అన్‌బ్లాక్ అవుతుంది.
షేక్ టు రిపోర్ట్
వాట్సాప్‌లో ఏవన్నా సాంకేతిక సమస్యలు ఉంటే ఒక్కోసారి మెసేజ్‌లు వెళ్లవు, రావు. వాటి గురించి మన కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్నవారికి తెలియజేయాలంటే.. జస్ట్ మన ఫోన్‌ని షేక్ చేస్తే చాలు. కాంటాక్ట్ లిస్ట్ ఓపెన్ అయ్యి ఓ ఆప్షన్ వస్తుంది. అందులో సమస్యేంటో వివరించి అందరికీ ఒకేసారి పోస్ట్ చేస్తే చాలు.
ప్రైవేట్ రిప్లైస్
వాట్సాప్‌లో మనం గ్రూప్ మెసేజ్‌లు చేస్తుంటాం. గ్రూప్‌లో ఉన్న వారు ఏ మెసేజ్ చేసినా అది అందరికీ వెళుతుంది. ప్రైవేట్‌గా మెసేజ్ పంపాలంటే వేరుగా కాంటాక్ట్ ఓపెన్ చేసిమెసేజ్ పంపాలి. అలా కాకుండా గ్రూప్‌లోనే ఉండి మనం మెసేజ్ పంపాలనుకునే వ్యక్తికి ప్రైవేట్‌గానే మెసేజ్ పంపొచ్చు. మెసేజ్ టైప్ చేసి సెట్టింగ్స్‌లో ఉండే ప్రైవేట్ రిప్లై ఆప్షన్ నొక్కితే చాలు.
ఈ కొత్త ఫీచర్లన్నీ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్నాయి. అయితే వాట్సాప్ వెబ్ 2.7315 వెర్షన్లో కేవలం ప్రైవేట్ రిప్లైస్, పిక్చర్ ఇన్ పిక్చర్ ఆప్షన్లు మాత్రమే అప్‌గ్రేడ్ అవుతాయి. 2.17.424, 2.17.436, 2.17.437 వెర్షన్లలో ట్యాప్ టు అన్‌బ్లాక్, న్యూ ఇన్వైట్ వయా లింక్, షేక్ టు రిపోర్ట్ ఆప్షన్లు ఆప్‌గ్రేడ్ అవుతాయి.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







